పుత్తూరు పట్టణం స్వామి వీధి నందు వెలసిన శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక ఆలయంలో సంకష్టహర చతుర్థి పురస్కరించుకొని శుక్రవారం మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం, సాయంత్రం 6 గంటలకు స్వామివారికి అభిషేక కార్యక్రమం, సాయంకాలం 7గంటలకు సంకష్టహర చతుర్థి వ్రతం నిర్వహించామని నిర్వాహకులు తెలిపారు. భక్తులు విరివిగా పాల్గొని గణనాథుని స్మరించుకుంటూ వ్రతం చేశారు.