శ్రీ చైతన్య పాఠశాలలో శనివారం పూర్వ ప్రాథమిక విద్యార్థులకు పుత్తూరు ఏజీఎం సురేష్ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏజీఎం దీపప్రజ్వలన చేశారు. అనంతరం విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థి దశలో ప్రతి ఒక్కరూ ఉల్లాసంగా ఆటలాడుకోవడం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుందని తెలిపారు.