బీసీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధికి దరఖాస్తు చేసుకోవాలని పుత్తూరు మున్సిపల్ కమిషనర్ మంజునాథ్ గౌడ్ సోమవారం సాయంత్రం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ, బ్రాహ్మణ, ఈబీసీ, కమ్మ, క్షత్రియ, రెడ్డి, వైశ్య, కాపు (బలిజ, తెలగ, ఒంటరి) కులాలకు చెందిన అభ్యర్థులు అర్హులన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ లేదా స్థానిక సచివాలయంలో గాని ఈనెల ఏడు లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.