నగరి నియోజకవర్గం పుత్తూరు అర్బన్ పరిధిలో శనివారం స్కూలు టీచర్లు, జూనియర్ కాలేజీ లెక్చరర్లు, వార్డు వెల్ఫేర్ అసిస్టెంట్లు, అంగన్వాడీ టీచర్లకు కిశోర వికాసంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ కమిషనర్ మంజునాథ గౌడ్ వచ్చారు. ఆయన మాట్లాడుతూ కిశోర వికాసం పై అవగాహన ప్రస్తుతం పిల్లలకి చాలా అవసరం అన్నారు. కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.