నగరి మండలం కుశస్థలీ నదీతీరమున వున్న వేంబలగి కరుమారియమ్మ అమ్మవారి ఆలయంలో శనివారం ఉదయం విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలందరూ కలసి అమ్మవారికి ప్రీతికరమైన వేపాకులు భక్తితో అర్పించారు. అనంతరం నైవేద్యముగా అంబలి, పొంగళ్ళు సమర్పణ చేసి హారతులిచ్చారు. వేసవి తాపాన్ని తగ్గించడం కోసం అమ్మవారికి ప్రతి ఏటా ఇక్కడ పూజలు నిర్వహిస్తామని స్థానికులు తెలిపారు.