కీలపట్టు ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

73చూసినవారు
కీలపట్టు ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
నగరి మండలం కీలపట్టు కొండమీద వెలసిన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో శనివారం ఉదయం విశేష పూజలు నిర్వహించారు. ఉదయాన్నే పంచామృతములతో అభిషేకము చేపట్టారు. అనంతరం వివిధ రకాల పుష్పాలతో అలంకరించి స్వామి వారికి ప్రీతికరమైన తమలపాకులతో అర్చన చేశారు. అధిక సంఖ్యలో వచ్చిన భక్తులు కర్పూర నీరాజనాలు అందజేశారు. ఆలయ నిర్వాహకులు సురేష్ వచ్చిన భక్తులకు ప్రసాదాలు వితరణ చేశారు.

సంబంధిత పోస్ట్