విజయపురం మండలంలోని పేదలకు అందరికీ ఇంటి స్థలాలు ఇవ్వాలని పాతర్కాడు వారికి ఇంటి స్థలాలు ఇప్పించాలని కోరుతూ సిపిఐ పార్టీ మండల నాయకులు రవి ఏసు పాదం అధ్యక్షతన విజయపురం ఎమ్మార్వో కార్యాలయం దగ్గర ధర్నా గురువారం నిర్వహించడం జరిగింది. సిపిఐ పార్టీ నగరి నియోజకవర్గ కార్యదర్శి కోదండయ్య పాల్గొని మాట్లాడుతూ పేదల ప్రజలకి అర్హులైన అందరికీ కూటమి ప్రభుత్వం మూడు సెంట్లు ఇంటి స్థలాల కేటాయించాలని డిమాండ్ చేశారు.