నిండ్ర మండలం భవిత కేంద్రంలో ప్రపంచ లూయిస్ బ్రెయిలీ దినోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. మండల విద్యాశాఖాధికారి మాట్లాడుతూ ఎందరో అంధుల విద్యాభివృద్దికి బ్రెయిలీ లిపి ఎంతగానో ఉపయోగపడుతుందని, ఈ లిపినే చుక్కల లిపి అని అంటారని తెలిపారు. కార్యక్రమంలో మండల విద్యాశాఖాధికారులు వసుమతిదేవి, రాజు పాల్గొన్నారు. సహిత ఉపాధ్యాయులు వాసు, వెంకటేశులు మాట్లాడుతూ ఈ అంధ విద్యార్థుల పట్ల తల్లిదండ్రులు బాద్యత వహించాలన్నారు.