కార్మిక చట్టాలు, హక్కులపై కార్మికులకు అవగాహన అవసరమని పలమనేరు జూనియర్ సివిల్ జడ్జి లిఖిత అన్నారు. సముద్రపల్లిలోని పరాగ్ డెయిరీలో కార్మికులతో కలిసి ఆమె శనివారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. కార్మికులకు కనీస వేతనాలు చెల్లించకుండా పనిలో నియమించరాదన్నారు. వెట్టిచాకిరి నిర్మూలన చట్టం ప్రకారం నిబంధనలను ఉల్లంఘించిన యజమానులపై చర్యలు తీసుకోవాలని కోరారు.