పలమనేరు మండలం కొలమాసనపల్లిలో వెలసిన శ్రీ చెల్వరాయ స్వామి వారి బ్రహ్మోత్సవ క్యాలెండర్ ను ఆలయ కమిటీ, గ్రామస్థుల ఆధ్వర్యంలో మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఏప్రిల్ 5వ తేదీ నుంచి 11వ తేదీ వరకు జరిగే బ్రహ్మోత్సవాలకు ప్రజలందరూ కుటుంబ సమేతంగా విచ్చేయాలని కోరారు. ఎండోమెంట్ అధికారులు ఆలయ అభివృద్ధికి సహకరించాలని డిమాండ్ చేశారు.