చిత్తూరు జిల్లా పలమనేరు మండలం, నక్కపల్లి గ్రామం ఈశ్వరయ్య అనే రైతుకు చెందిన గడ్డి వాములో గురువారం ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. ఎండుగడ్డికి నిప్పు తోడవడంతో మంటలు అదుపు చేయలేని పరిస్థితి ఏర్పడింది. స్థానికులు గమనించి ఫైర్ స్టేషన్ కు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు. ప్రమాదం ఎలా జరిగింది అని ఆరా తీస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.