పెద్దపంజాణి మండలం ముదరంపల్లెలో ఎమ్మెల్యే అమర్నాథరెడ్డి ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులను ఆరా తీశారు. పనులు వేగవంతం చేయాలని సూచించారు. ఆయన వెంట మాజీ ఎంపీపీ విజయభాస్కర్ రెడ్డి, టీడీపీ నాయకులు, అధికారులు ఉన్నారు.