వీ. కోట మండల కేంద్రంలోని దాసార్లపల్లి వద్ద జరుగుతున్న హంద్రీనీవా సుజల స్రవంతి రెండో దశ కుప్పం ఉప కాలువ పనులను ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డితో కలసి నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా పనులను పరిశీలించి ఆయన సంతృప్తిని వ్యక్తం చేశారు. అదే విధంగా జూన్ నెలాఖరుకు పనులు పూర్తి చేయాలని లక్ష్యంతో ఉన్నట్లు ఆయన వివరించారు. గత ప్రభుత్వం ఈ పనులను నిర్లక్ష్యం చేశారన్నారు.