యుద్ధ నేపథ్యంలో ప్రజల్లో అప్రమత్తత పెంచడానికి పలమనేరులో మాక్ డ్రిల్ నిర్వహించామని పలమనేరు డీఎస్పీ ప్రభాకర్ చెప్పారు. పట్టణంలోని జవళి వీధిలో మాక్ డ్రిల్ నిర్వహించారు. ఒకవేళ పాకిస్థాన్ మన దేశంపై ప్రతి దాడి చేస్తే ఆ సమయంలో ప్రజలు ఎలా స్పందించాలో ఈ మాక్ డ్రిల్స్ ద్వారా అవగాహన కల్పించినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐలు నరసింహ రాజు, మురళీ, ప్రసాద్, తహశీల్దార్ ఇన్భనాధన్ పాల్గొన్నారు.