గంగవరం మండలం కలగటూరు గ్రామం వద్ద మంగళవారం చింత చెట్లు నరికి తరలిస్తున్నారన్న సమాచారం అందడంతో పలమనేరు అటవీ శాఖ అధికారి నారాయణ తన సిబ్బందితో ఘటన ప్రాంతానికి చేరుకున్నారు. చెట్లను కొట్టడానికి ఎటువంటి అనుమతులు లేకపోవడంతో చింత చెట్ల లోడుతో ఉన్న లారీని అటవీశాఖ కార్యాలయానికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.