కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు గిరిధర్ ఆధ్వర్యంలో పలమనేరు పట్టణంలోని అంబేడ్కర్ సర్కిల్ వద్ద బుధవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. కార్మికులు పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దుచేసి, లేబర్ కోడు అమలు చేయాలని చూస్తోందన్నారు. కార్మికులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉందన్నారు.