మహిళా ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమంలో భాగంగా బైరెడ్డిపల్లి మండలం, కమ్మనపల్లి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం నందు నిర్వహించారు. భారతదేశపు మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు, మహిళల కోసం పాఠశాలలను స్థాపించిన స్త్రీ జాతి ఆణిముత్యం సావిత్రిబాయి పూలే 194వ జయంతి వేడుకలను యం. డి. హెచ్. ఫౌండేషన్ అధినేత డాక్టర్. యం. డి. పవన్ కళ్యాణ్ మరియు శ్రీ కళాతరంగిణి సంస్థ అధినేత యం. రాజేష్ బాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.