ప్రభుత్వ ఆసుపత్రిలో పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జడ్పీ ఛైర్మన్ శ్రీనివాసులు స్పష్టం చేశారు. పలమనేరు సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. మెరుగైన వైద్య సేవలపై సిబ్బందితో చర్చించారు. రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. వైద్యులు, సిబ్బంది తప్పనిసరిగా ఆసుపత్రిలో అందుబాటులో ఉండాలన్నారు. నాయకులు హేమంత్ కుమార్ రెడ్డి, చంగారెడ్డి రాజేశ్ ఉన్నారు.