దాడి కేసులో నిందితులకు పిఎస్సీ కోర్టులో శుక్రవారం ఐదేళ్ల శిక్ష విధించారు. బంగారుపాలెం మండలంలోని టేకుమందకు చెందిన శ్రావణ్ కుమార్ కు పదేళ్ల క్రితం రోజాతో వివాహమైంది. మద్యం మత్తులో నిత్యం భార్యను వేధించేవాడు. 2022 జూలైలో రోజా కుటుంబ సభ్యులు అతని ఇంటికి రాగా తన తండ్రి సుబ్రహ్మణ్యంతో కలిసి వారిపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. నేరం రుజువు కావడంతో శిక్ష విధించారు.