పూతలపట్టు మండలంలోని గోపాలకృష్ణాపురం సమీపంలోని హైవేపై గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ కారు డ్రైవర్ నిద్రమత్తులో వేగంగా వెళ్లి కల్వర్టును ఢీకొట్టాడు. తమిళనాడు నుంచి తిరుమలకు వెళ్తుంగా ఈ ఘటన జరిగింది. కారులో ఉన్న పలువురుకి తీవ్ర గాయాలు కావడంతో, వారిని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.