పూతలపట్టు: ట్రాక్టర్ దొంగతనంపై కేసు నమోదు

80చూసినవారు
పానాటూరు రాధాకృష్ణ గ్రానైట్ ఫ్యాక్టరీ వద్ద ట్రాక్టర్ దొంగతనం జరిగింది. బాధితుడు బాలకృష్ణ నాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు శనివారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ రామ్మోహన్ శనివారం తెలిపారు. గుర్తు తెలియని దొంగలు ట్రాక్టర్ దొంగతనానికి పాల్పడ్డారని, త్వరలోనే వారిని గుర్తించి దొంగలను అరెస్ట్ చేస్తామని తెలిపారు. దొంగతనానికి సంబంధించిన సీసీ వీడియోను పోలీసులు విడుదల చేశారు.

సంబంధిత పోస్ట్