చిత్తూరు జిల్లా కాణిపాకంలో వెలసిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారిని బుధవారం మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కుమార్తె దీపా వెంకట్ వారి కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆమెకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం అర్చకులు స్వామివారి ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు.