కాణిపాకం శ్రీదేవి భూదేవి సమేత వరదరాజస్వామి ఆలయంలో మంగళవారం రథసప్తమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉభయ దారులుగా కాకర్ల వారి పల్లెకు చెందిన కీ. శే. నాదముని కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఆలయ ఈవో పెంచల కిషోర్ ఆధ్వర్యంలో ఘనంగా హోమం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామోత్సవం నిర్వహించారు. ఆలయ అధికారులు, సిబ్బంది భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.