కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని ఆస్థాన మండపంలో సోమవారం ఘనంగా సరస్వతి యాగం నిర్వహించారు. ఎమ్మెల్యే మురళీమోహన్ పదో తరగతి విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించాలని సరస్వతి కటాక్షం కలగాలని కోరుకుంటూ యాగం నిర్వహించారు. ఎస్ఎస్ఏ ఏపీసి వెంకటరమణ, కాణిపాకం పరిసర ప్రాంతాలలోని జడ్పీ పాఠశాల పదవ తరగతి విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, అధికారులు పాల్గొన్నారు.