పూతలపట్టు నియోజకవర్గం మహాసముద్రం గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామదేవత సత్తెమ్మ తల్లి ఆలయంలో శనివారం మండలాభిషేకం పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలో ఉదయం అమ్మవారి మూలమంత్రంతో హోమం చేశారు. అమ్మవారిని పంచామృతములతో అభిషేకించి నూతన వస్త్రాలతో అలంకరించారు. వేదపండితులు సెల్వరాజ్ ఆచారి , రూపేష్ క్రిష్ణ ఆచార్యుల బృందంచే మంత్రోచ్ఛారణ నడుమ కలశ సంప్రోక్షణ గావించారు.