చిత్తూరు పార్లమెంట్ సెగ్మెంట్ అభివృద్ధికి కృషి చేస్తానని ఎంపీ దగ్గు మళ్ళ ప్రసాదరావు బుదవారం తెలిపారు. కాణిపాకంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, నేను ఎంపీగా ప్రజలకు సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. చిత్తూరు పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల అభివృద్ధి కోసం కేంద్ర మంత్రులను కలుస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు పాల్గొన్నారు.