పుంగనూరు పట్టణం ఎంబీటీ రోడ్డు నుంచి తాటిమాకుల పాళ్యంకు వెళ్లే మార్గం మొదట్లో కల్వర్టు కృంగి గొయ్యి ఏర్పడింది. దీంతో అటు వైపు వెళ్లే వాహన చోదకులు, పాదచారులు ఇబ్బంది పడుతున్నారు. నిత్యం రద్దీగా ఉండే ఈ రోడ్డులో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకముందే అధికారులు, పాలకులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.