పుంగనూరులో దక్షిణామూర్తికి అభిషేకాలు

53చూసినవారు
చిత్తూరు జిల్లా పుంగనూరు అర్బన్ కోనేటిపాళ్యం సమీపానగల శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో శ్రీ దక్షిణామూర్తికి గురువారం అభిషేకాలు నిర్వహించారు. మొదట అర్చకులు స్వామివారి మూల విగ్రహాకి పాలు, పెరుగు, చందనము, వీభూదితో అభిషేకం చేశారు. తర్వాత అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం ఆలయానికి విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్