జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదుల కాల్పుల్లో అమరుడైన కార్తీక్ యాదవ్ దశకర్మలో జిల్లా రెవెన్యూ అధికారి కె. మోహన్ కుమార్ పాల్గొన్నారు. బంగారుపాళ్యం మండలం ఎగువ రాగిమాను పెంటకు చేరుకున్న డిఆర్వో కార్తీక్ యాదవ్ చిత్రపటానికి పూలమాలను వేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.