ఏపీడబ్ల్యూ జేఎఫ్ చిత్తూరు జిల్లా శాఖ ఎన్నికలు జనవరి 27న నిర్వహించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారులు సాటి గంగాధర్ చల్ల జయచంద్రాలు వెల్లడించారు. ఆదివారం చిత్తూరులోని యూనియన్ జిల్లా కార్యాలయంలో ఎన్నికల నోటిఫికేషన్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. జర్నలిస్టుల కోసం రాజీలేని పోరాటం చేస్తున్న ఏపీడబ్ల్యూ జేఎఫ్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు.