చౌడేపల్లి: ద్విచక్ర వాహనాలు ఢీకొని వ్యక్తికి గాయాలు

60చూసినవారు
చౌడేపల్లి: ద్విచక్ర వాహనాలు ఢీకొని వ్యక్తికి గాయాలు
చిత్తూరు జిల్లా, పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం ఆమిని గుంట గ్రామానికి చెందిన రాజేష్ శనివారం ద్విచక్ర వాహనంలో తెల్లనీళ్ల పల్లె గ్రామానికి వెళ్లి తిరిగి వస్తున్నాడు. ఈ క్రమంలో మార్గమధ్యంలోని మలుపు వద్ద ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనం ఢీకొనడంతో రాజేష్ త్రివంగా గాయపడ్డాడు. రాజేష్ ను స్థానికులు హుటాహుటిన పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రి తరలించి చౌడేపల్లి పోలీసులకు సమాచారం అందించారు.

సంబంధిత పోస్ట్