ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఆదివారం అన్ని చోట్ల దట్టంగా పొగమంచు కురుస్తోంది. రోడ్లు కూడా కనపడనంతలా మంచు ఉండటంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. లైట్లు వేసుకుని రాకపోకలు సాగిస్తున్నారు. మరోవైపు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. అలాగే పుంగనూరు మండలంలో ప్రజలు చలికి వణికిపోతున్నారు.