పులిచెర్ల: హత్య కేసులో మరో నిందితుడు అరెస్ట్

51చూసినవారు
పులిచెర్ల: హత్య కేసులో మరో నిందితుడు అరెస్ట్
పుంగనూరు నియోజకవర్గం పులిచెర్ల మండలం ఆవుల పెద్దిరెడ్డి గారి పల్లె వ్యవసాయ పొలంలో జనవరి 18న ప్రభాకర్ అనే రైతును హత్య చేసిన కేసులో నలుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెంకటేశ్వర్లు గురువారం సాయంత్రం తెలిపారు. నిందితుల్లో ముగ్గురిని జనవరి 24న అరెస్టు చేయగా మరో నిందితుడు అరికెలవారి పల్లెకు చెందిన శివశంకర్ ను పులిచెర్ల బస్టాండులో అరెస్టు చేసినట్లు ఎస్సై వివరించారు.

సంబంధిత పోస్ట్