చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం పులిచెర్ల మండలం కల్లూరు గ్రామంలో గల బీసీ సంక్షేమ సంఘం బాలుర హాస్టల్లో రెండు నెలలుగా విద్యుత్తు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని బీసీ సంఘం తిరుపతి జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్ హాస్టల్ వద్ద నిరసన నిర్వహించారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన మాట్లాడుతూ హాస్టల్లో త్రాగునీరు, విద్యుత్ సౌకర్యం లేక బీసీ విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.