పుంగనూరు: 1800 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం

77చూసినవారు
పుంగనూరు: 1800 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం
పుంగనూరు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన దాడుల్లో 1800 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేసినట్లు ఎస్సై వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మంగళవారం మండల పరిధిలోని జువ్వలదిన్నె తండ, పెద్ద తండా పరిసరాల్లో దాడులు నిర్వహించామన్నారు. నాటుసారా తయారీకి ఉపయోగించే 1800 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేసి ప్లాస్టిక్ డ్రమ్ములను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్