ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి విజయం సాధించడంతో పుంగనూరు ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఆ పార్టీ శ్రేణులు శనివారం సంబరాలు జరుపుకున్నారు. బీజేపీ పట్టణ అధ్యక్షుడు జగదీశ్ రాజు మాట్లాడుతూ అవినీతిలో కూరుకుపోయిన ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలకు ప్రజలు తగు రీతిలో బుద్ధి చెప్పారన్నారు. వారి పాలనలో అభివృద్ధి శూన్యమని ప్రజలు గుర్తించాలని జగదీశ్ రాజు అన్నారు.