పుంగనూరు పట్టణంలోని బసవరాజు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు శనివారం నుంచి డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం ప్రారంభమైంది. నియోజవర్గ ఇన్‌ఛార్జి చల్లా బాబు ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.