చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణ పరిధిలోని రాంనగర్ వద్ద గురువారం సాయంత్రం ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో గార్గేయ, నరసింహులు ఘర్షణ పడ్డారు. ఈ ఘర్షణలో వారు తీవ్రంగా గాయపడటంతో స్థానికులు హుటాహుటిన స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.