పుంగనూరు: పారిశుద్ధ్య కార్మికులకు దుస్తులు పంపిణీ

69చూసినవారు
పుంగునూరు మున్సిపల్ కార్యాలయంలో బుధవారం మున్సిపల్ కార్మికులకు ప్రభుత్వం మంజూరు చేసిన దుస్తులను మున్సిపల్ చైర్మన్ అలీమ్ భాష , కమిషనర్ మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ప్రజల సేవలో నిత్యం నిమగ్నమై ఉండే పారిశుధ్య కార్మికులకు ఈ విధంగా యూనిఫామ్, చీరలు, తదితర వస్తువులు ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా అధికారులకు కార్మికులు ధన్యవాదాలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్