చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలోని 6 మండలాలలో శనివారం చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. చలి దెబ్బకు ప్రజలు ఇళ్లల్లో నుంచి బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది. ఈ చలికి తోడుగా మంచు కూడా విపరీతంగా పెరగడంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మారుతున్న వాతావరణంతో ఎక్కువమంది చిన్నారులు ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారు.