పుంగనూరు పట్టణం కోనేటిపాళ్యం సమీపానగల శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం ధనుర్మాసం సందర్భంగా శేష పూజలు జరిగాయి. ఉదయాన్నే అర్చకులు శ్రీవారిని సుప్రభాత సేవతో మేల్కొల్పి పూజాధి కార్యక్రమాలు నిర్వహించారు. తర్వాత శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని ఉత్సవ మూర్తులను అలంకరించి భక్తుల దర్శనార్థం మండపంలో కొలువు తీర్చారు. ఆలయానికి వచ్చిన భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.