పుంగనూరులోని తూర్పు మొగసాలలో కొలువైన శ్రీ చాముండేశ్వరి దేవి ఆలయానికి భక్తులు పోటెత్తారు. శుక్రవారం ఉదయం అమ్మవారికి అర్చకులు విశేష పూజలను నిర్వహించారు. మహిళలు అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజించారు. అమ్మవారి ఎదుట పిండి దీపాలు వెలిగించి, అంబలి సమర్పించారు. ఆలయానికి వచ్చిన భక్తులకు అర్చకులు అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు.