వయస్సు పైబడిన పెద్దలను ప్రేమతో చూసుకొని అండగా నిలవాలని పుంగనూరు అర్బన్ ఎస్ఐ లోకేష్, జూనియర్ సివిల్ జడ్జి రామచంద్రరావు ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా పుంగనూరు పట్టణంలోని తెలుగు తల్లి వృద్ధాశ్రమంలో ఎస్సై లోకేష్ వృద్ధులకు రూ.12 వేల విలువచేసే నిత్యవసర సరుకులు వితరణ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, వృద్ధులు ప్రేమ, మర్యాద, ప్రశాంతతను తప్ప ఇంకా ఏమి ఆశించరన్నారు. వారికి మనో ధైర్యాన్ని అందించాలని పిలుపునిచ్చారు.