ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక తీరు ప్రదర్శిస్తూ అధికారంలోకి వచ్చాక మరో తీరు ఉంటే ఎలా సీఎం గారు అని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి సభ్యులు మున్న ప్రశ్నించారు. ఈ సందర్భంగా మంగళవారం పుంగనూరు నియోజకవర్గం సదుం మండలంలోని జూనియర్ కళాశాలలో నిరసన కార్యక్రమం చేపట్టామని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తమకు ఇచ్చిన మాట ఏమైంది అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.