పుంగనూరు నియోజకవర్గం సదుం మండలం బూరగమందలోని భూదేవి, శ్రీదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం రాత్రి స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించిన అశ్వ వాహనంపై మేళతాళాలు, పండరి భజనలు, గోవింద నామాల మధ్య భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమాలన్నీ కూడా టిటిడి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు ఆలయ ఇన్స్పెక్టర్ తెలియజేశారు.