పుంగనూరు వద్ద మంగళవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల కథనం మేరకు పుంగునూరు పట్టణంలోని అన్న క్యాంటీన్ సమీపంలో చదల్ల గ్రామానికి చెందిన లక్ష్మారెడ్డి నడుచుకుని వెళుతుండగా బైక్ అదుపుతప్పి ఢీకొంది. ప్రమాదంలో ఆయనకు గాయాలు కావడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ద్విచక్ర వాహనదారుడు లోహిత్ కు స్వల్ప గాయాలయ్యాయి. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.