పుంగనూరు: బోయకొండ గంగమ్మ దర్శించుకున్న మంత్రి రాంప్రసాద్

73చూసినవారు
చిత్తూరు జిల్లా. పుంగనూరు నియోజకవర్గం. చౌడేపల్లి మండలంలోని శ్రీ బోయకొండ గంగమ్మ అమ్మవారిని శుక్రవారం రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి , జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూర్ణకుంభంతో ఆలయ కార్యనిర్వాహణ అధికారి ఏకాంబరం వారికి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి చల్లా రామచంద్రారెడ్డి. టిడిపి నాయకులు , అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్