పుంగనూరు నియోజకవర్గంలోని చౌడేపల్లి, సోమల, సదుం, పులిచెర్ల, పుంగనూరు తదితర మండలాలలో శనివారం రాత్రి ఓ మోస్తరుగా వర్షం కురుస్తుంది. సాయంకాలం నుంచి వాతావరణం లో మార్పు చోటుచేసుకుని ఆకాశమంత కూడా నల్లటి మబ్బులు కమ్ముకున్నాయి. అనంతరం వచ్చినటువంటి ఉరుముల శబ్దానికి ప్రజలు భయభ్రాంతులకు లోనయ్యారు. ఏది ఏమైనా ప్రస్తుతం కూర్చున్న వర్షం వాతావరణంలోని వేడిమిని తగ్గిస్తుందని ప్రజలు తెలియజేశారు.