పుంగనూరు మండలం మేలుందొడ్డి గ్రామంలో శనివారం ఉదయం ఎమ్మార్ఓ రాము రెవెన్యూ సదస్సు నిర్వహించారు. డీకేటీ, రీ సర్వే, ఇతర రెవెన్యూ సంబంధిత అంశాలపై ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రజల నుంచి అందుకున్న వినతులను పరిశీలించి త్వరతగతిన పరిష్కరిస్తామని ఎమ్మార్ఓ తెలిపారు. కార్యక్రమంలో మండల సర్వేయర్లు, వీఆర్వోలు, నాయకులు పాల్గొన్నారు.