చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలోని కౌండిన్య నది స్థలాన్ని ఆక్రమించి ఏర్పాటుచేసిన రేకుల షెడ్డును మున్సిపల్ అధికారులు శుక్రవారం తొలగించారు. ఈ కార్యక్రమం రెవెన్యూ, మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ఆక్రమణలను గుర్తించారు. పోలీసుల రక్షణ మధ్య వీటిని తొలగించారు. ప్రభుత్వ భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టినా చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. ప్రజలు అధికారులకు సహకరించాలన్నారు.